May 17, 2024

నేడు తెలంగాణతో పాటు ఇతర మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌటింగ్‌ | Today Election Counting in 4 States



Published Dec. 3, 2023, 12:01 p.m. by Naomi Charles


మధ్యప్రదేశ్ , చత్తీస్ గఢ్ , రాజస్థాన్ శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా నేడే వెలువడనున్నాయి. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం....... మధ్యప్రదేశ్ లో అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాలతో ఆ రాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా...... 116చోట్ల గెలిచిన పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటు చేయనుంది. ఛత్తీస్ గఢ్ లో 90 స్థానాలు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది ఆసక్తి మారింది. ఇక్కడ కాంగ్రెస్ అవలీలగా 46 సీట్ల మెజారిటీ మార్కును అందుకుని రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక ప్రతిసారి అధికారాన్ని మార్చే... సంప్రదాయం ఉన్న రాజస్థాన్ లో..... ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ఈసారి విపక్ష భాజపా.. అధికార కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తుందన్న అంచనాలతో ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడింది. రాజస్థాన్ లో 200 స్థానాలు ఉండగా..... ఓ అభ్యర్థి మరణంతో 199 స్థానాలకే ఎన్నికలు నిర్వహించారు. ఈ పరిస్థితిలో వంద సీట్లు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

----------------------------------------------------------------------------------------------------------------------------

#etvandhrapradesh

#latestnews

#newsoftheday

#etvnews

----------------------------------------------------------------------------------------------------------------------------

☛ Download etv Win App to Watch All etv Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

-----------------------------------------------------------------------------------------------------------------------------

For Latest Updates on etv Channels !!!

☛ Visit our Official Website:http://www.ap.etv.co.in

☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K

☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY

☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh

☛ Follow us : https://twitter.com/etvandhraprades

☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh

etv Win Website : https://www.etvwin.com/

-----------------------------------------------------------------------------------------------------------------------------

You may also like to read about:



Resources:

Similar videos

2CUTURL

Created in 2013, 2CUTURL has been on the forefront of entertainment and breaking news. Our editorial staff delivers high quality articles, video, documentary and live along with multi-platform content.

© 2CUTURL. All Rights Reserved.